Home తాజా వార్తలు జిహెచ్ఎంసికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు

జిహెచ్ఎంసికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు

GHMCహైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కు కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ కు ఈ అవార్డు దక్కడంపై మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల వ్యవధిలోనే జిహెచ్ఎంసికి రెండు అవార్డులు రావడం సంతోషం కలిగిస్తుందని వారు తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది మంచి ర్యాంకింగ్ సాధిస్తామని వారు వెల్లడించారు. జిహెచ్ఎంసికి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Swachhta Excellence Award for GHMC