Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఢిల్లీలో స్వామి అగ్నివేష్‌పై దాడి

Swami Agnivesh assaulted in New Delhi

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై దాడి జరిగింది. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయి పార్థివదేహాన్ని ఉంచారు. ఈ క్రమంలో అగ్నివేష్ వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు అక్కడికి వచ్చారు. దీంతో కొందరు బిజెపి సానుభూతిపరులు స్వామి అగ్నివేష్‌పై దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు అగ్నివేష్‌ను రక్షించి అక్కడి నుంచి పంపించారు. జార్ఖండ్‌లో గత నెలలో బిజెవైఎం కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.

Swami Agnivesh assaulted in New Delhi

Comments

comments