Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కనకదుర్గమ్మను దర్శించుకున్న స్వామి పరిపూర్ణానంద

Swami Paripoornananda visited Kanakadurgamma Temple

విజయవాడ : కనకదుర్గమ్మను స్వామి పరిపూర్ణానంద మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణను కోర్టు ఎత్తివేయడంతో ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతోనే తాను కోర్టులో విజయం సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతదూరమైన వెళుతానని ఆయన తేల్చి చెప్పారు. ఆయన వెంట హైదరాబాద్ ఉప్పల్ ఎంఎల్‌ఎ ఎన్.వి.ఎస్.ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Swami Paripoornananda visited Kanakadurgamma Temple

Comments

comments