Home రాష్ట్ర వార్తలు స్వామీజీలు సామాజిక గందరగోళం సృష్టించకూడదు

స్వామీజీలు సామాజిక గందరగోళం సృష్టించకూడదు

వారి మధ్య మార్కెటింగ్ పోకడలు తల ఎత్తకూడదు వేంకటేశ్వరుడి మీద అలగలేదు రాజ్యాంగం నుంచి లౌకికవాదం పదాన్ని తొలగించాల్సిన అవసరం లేదు
షష్ఠిస్ఫూర్తి సందర్భంగా ‘మన తెలంగాణ’తో చిన జీయర్‌స్వామి

Chinnaఈ ఏడాది భగవద్రామానుజుల వెయ్యేళ్ళ పండు గ, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజు పెద్ద జీయర్ స్వామి 108 సంవత్సరాల పండుగ,శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి షష్టి స్ఫూర్త్తి ఉత్స వాల సందర్భంగా ‘మన తెలంగాణ’ ప్రత్యేక ప్రతి నిధి డాక్టర్ వడ్లమాని కనకదుర్గతో శ్రీ చిన్నజీయర్ స్వామి చేసిన భాషణం. స్వామి మీకు ముందుగా షష్టి స్ఫూర్తి శుభాభివందనాలు.
ప్రశ్న: 1980వ సంవత్సరంలో సన్యాసాశ్ర మాన్ని స్వీకరించారు. అంటే సుమారు 36 సంవ త్సరాలైంది. మీరు మీ లక్షాన్ని చేరుకోగలి గారనుకుంటున్నారా?
జవాబు: ప్రపంచంలో సాధించాల్సింది చాలా ఉంటుంది. లక్ష్యాన్ని చేరడమంటూ ఉండదు. నేను చేయాలనుకున్న దాంట్లో కొంతవరకు చేశాను. ఆరోగ్యం, విద్య, ఆలయాలు, వేదాలు, సంప్రదా య పరిరక్షణ వంటి అనేక కార్యక్రమాలకు సం బంధించి చేయాల్సింది చాలా వుంది. భక్తుల సహ కారంతో ఇంకా చేయగలను. పూర్తి చేయగలనన్న నమ్మకం ఉంది.
ప్ర: నారాయణ స్వామి జీయర్ స్వామిగా మార డాన్ని ఎలా విశ్లేషించుకుంటారు?
జ: నేను స్వామికి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, పెద్ద జీయర్ స్వామి గారి చూపు నావైపు ఉండడంతో నేను సన్యసించటం జరిగింది. 1008 కుండాలతో జరిగిన యాగానికి ఎవరో ఒకరు కావాలి అనుకున్నప్పుడు శ్రీమాన్ గోపాలా చార్యులు అంగీకరించడం జరిగింది. ఇంతవరకు గురువు గారి అనుగ్రహంతో బాగానే చేశానను కుంటున్నాను.
ప్ర: ఇప్పుడున్న స్వామీజీలకు భిన్నంగా సంప్రదా యాలను బ్రేక్ చేసి, మీరు అందరితో కలిసిపోయి పనిచేస్తున్నారు.
జ: సమాజంలో ఉండేటప్పుడు సాధువులుగా ఉన్న ప్పుడు భాగస్వాములతో కలిసి పనిచేయాలి. ప్రోగ్రె సివ్ ఐడియాలతో ముందుకు సాగాలి.
ప్ర: అప్పట్లో మిమ్మల్ని కొంతమంది యతిస్ట్, మార్కిస్ట్‌గా అభివర్ణించారు. అంటే మీలో మార్కి జం దృక్పథం ఉండేదా?
జ: నేను నాస్తికుడనని కాదు. అప్పట్లో నా సందే హలకు సరైన సమాధానం దొరకలేదు. తర్వాత అన్వేషణ చేసి విశ్వసించడం మొదలుపెట్టి సమా ధానం ఇవ్వగలిగే స్థాయికి చేరుకోగలిగాను.
ప్ర: మిమ్మల్ని మీరు సామాజిక కార్యకర్తనని చెప్పు కుంటారే తప్ప, స్వామీజీని, పీఠాధిపతినని చెప్పుకోరు 
ఎందుకు?
జ : రామానుజాచార్యులను ఆదిశేషుడి అవతారంగా అందరూ భావించారు. వారు హరిజనులతో కలిసి తిరిగారు. వారిలాగే నేను సామాజిక కార్యక ర్తనని చెప్పుకోవడానికే ఇష్టపడతాను. ప్రజలకు మంచి నా ఉద్ధేశం.
ప్ర: ఆశ్రమం తరపున మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు సక్సెస్ అయ్యాయి?
జ: ఆదిలాబాద్ జిల్లా హుస్నూర్ దగ్గర ఆలంపల్లిలో గిరిజన పాఠశాల, ఒంగోలు జిల్లా బీరసాయిపేటలో గిరిజనులు, గిరిజనేతరుల పాఠశాల, కటారి వారి పాలెంలో మత్సకారుల పిల్లల కోసం పాఠశాల, విజయ నగరం, శ్రీరామనగరంలో అంధుల పాఠశాల, సీతానగరం, శ్రీరామన గరాల్లో వేదపాఠశాల, బద్రీనాథ్, రుషికేశ్, తిరుపతి, భద్రాచలం, సీతానగరం, శ్రీరామనగరాల్లో నిత్యాన్నదానం వంటి కార్యక్రమాలు చక్కగా సాగుతున్నాయి. జీయర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంతోమంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.
ప్ర: ప్రస్తుతం స్వామీజీల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉందంటారా?
జ: ఉందని అనుకుంటాను. పోటీ అనేది సహజం. ప్రతి ఒక్కరూ విషయ అన్వేషణ చేస్తూ, ప్రజలకు ఆధాత్మికత పంచుతున్నారు.
ప్ర: స్వామీజీల నుండి వచ్చే ఒత్తిళ్లు సామాజికంగా గందరగోళానికి గురిచేస్తు న్నాయంటే మీరేమంటారు?
జ : సామాజిక గందరగోళాలను పక్కకు పెట్టగలిగితే బాగుంటుంది.
ప్ర: ఇటీవల సాయిబాబా దేవుడే కాదు ఆయనను పూజించవద్దని ఒక స్వామీ జీ అన్నారు. దానికి మీరేమంటారు?
జ: నీవు దేవుడివయ్యా అంటే శ్రీరాముడే స్వయంగా వచ్చి నేను మానవు డిగానే ఉంటాను అన్నాడు. ఆ వ్యక్తి చేసిన కార్యక్రమం మంచిదైతే తీసు కోండి. లేకపోతే వదిలేయండి. అతను దేవుడు అని చెప్పుకున్నాడా? లేదా హిందువా…, ముస్లిమా…. ఇవి కాదు చూడాల్సింది. మంచి వ్యక్తి గా ఉన్నాడా లేదా, పది మందిని మంచి మార్గంలో నడిపే కార్యక్ర మాలు చేస్తున్నాడా లేదా చూసి మీరే నిర్ణయించు కోండి.
ప్ర: స్వామీజీలు రకరకాల కార్యక్రమాలు చేస్తూ బిజినెస్ చేసుకోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఒక రకమైన అన్‌రెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. దీనికి మీరేమంటారు?
జ: స్వామీజీల మధ్య మార్కెటింగ్ పోకడలు రాకూడదు. వస్తే కనుక, ఇవి తగదు అని చెప్పేవాళ్లు ఉండాలి.
ప్ర: కొన్ని ఆశ్రమాలను చూస్తుంటే ఇవి ఆశ్రమాలా? వ్యాపార కేంద్రాలా? అన్న అనుమానం కలుగుతుంది. దీనికి మీరేమంటారు.
జ: వ్యాపార కేంద్రమంటే…? భగవంతున్ని పూజించడం కోసం డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకుంటే దాన్ని వ్యాపారం అనలేం. వ్యాపారం వేరు. డబ్బుల్ని తీసుకున్న సంస్థ దానిని సక్రమంగా వినియోగించాలి. మానసికమైన ఉన్నతిని కలిగించే స్థానాలుగా ఆలయాలు, ఆశ్రమాలు ఉంటాయనుకోండి. అటువంటి వాటిని ఆక్షేపణ చేయకూడదు. తీసుకు న్న ధనాన్ని చెడు పనులకు వినియోగిస్తుంటే తప్పు పట్టాలి కానీ, తమకు మంచి జరగడం కోసం పూజకు డబ్బులిస్తే తప్పుగా చూడకూడదు.
ప్ర: రాజకీయ నాయకుల కంటే కూడా స్వామీజీలే పవర్‌ఫుల్‌గా ఉన్నారు, ప్రభావితం చేస్తున్నారు మీరేమంటారు.
జ: తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. స్వామీజీల ప్రభావం ఏ రకంగాను రాజకీయాల మీద లేదు. కానీ, కర్ణాటకలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క స్వామీజీ ఉన్నారు, వాళ్ల చేతుల్లో రెండుమూడువందల కాలేజీలు ఉంటాయి. రాజకీయాల్లో గెలవాలంటే, ఆయా కమ్యూనిటీ ప్రజల ఓట్లు కావాలంటే ఆ స్వామీజీలను ఆశ్రయిం చక తప్పనిసరి పరిస్థితి.
ప్ర: ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణే మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారేమో?
జ: ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందునుంచి తెలంగాణలో మా ప్రాజెక్టులో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఇక్కడ ఎక్కువగా నడిపిస్తున్నాం. నడుస్తు న్నాయ్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నడుపుతున్నాం.
ప్ర: మీరు వెంకటేశ్వరస్వామి మీద అలిగారా? మీ అలక ఎప్పుడు తీరు తుంది? స్వామిని దర్శించుకొని12 ఏళ్లు అయింది కదా. బాధగా లేదా?
జ: నాకు దేవుడి మీద అలక లేదు. బాధగా లేదు. వేంకటేశ్వరుడు అన్నిచోట్లా ఉన్నాడు. అక్కడ స్వామి వైభవం స్వామికి ఉంటుంది. అక్కడికి వెళ్లి ఏం చెప్పుకొని నిలబడాలి. స్వామి వైభవాన్ని నేను పాడుచేయకుండా ఉంటే అప్పుడు స్వామి ముందు తలెత్తుకొని నిలబడగలిగే అర్హత వస్తే, అప్పుడు వెళ్లగలను. అక్కడ జరగాల్సిన కొన్ని పనులు వున్నాయి. గుడి లోపల జరగాల్సిన సవరింపులు ఉన్నాయి. అవి సక్రమంగా జరిగితే స్వామి శిష్యులుగా వారిని దర్శించుకుంటాం.
ప్ర : వెయ్యి కాళ్ల మండపానికి సంబంధించి కూడా భిన్న వాదనలు ఉన్నాయి కదా? వాటిని గురించి చెప్పండి.
జ: ప్రతి స్థానానికి ఒక చరిత్ర ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి ఒక చరిత్ర ఉంది. రామానుజులకు కూడా వెయ్యేళ్లు చరిత్ర ఉంది. తెలుసుకున్న వాళ్లు, అవగాహన ఉన్నవాళ్లే వాదనకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించామని టిటిడి అంటుంది. 2005వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేస్తున్నామంటే వెళ్లాము. రిజల్యూవేషన్ కూడా పాస్ చేశాం. కానీ, పునఃనిర్మాణం చేయలేదు. వెనకాలే ఉండి నడిపించే అధికారుల్లో మార్పు రావాలి.
ప్ర: చినజీయర్ స్వామిది మొండిపట్టుదల అని కొందరు అంటారు?
జ: తిరుపతి దేవస్థానం గురించి సబ్జెక్టు మీద పట్టు, అర్హత ఉన్న వ్యక్తి మాట్లాడితే నూరుశాతం అంగీకరించవచ్చు. దేవుడు, ఆలయం, ఆరాధ న అనేవి ఒక ఉత్సవం, ఒక సంప్రదాయం వంటివి.
ప్ర: మీకు ఆరోజు ఇచ్చిన హామీ వెయ్యికాళ్ల మండపం పునఃనిర్మాణం చేస్తా మనా? ప్రత్యామ్నాయం చేస్తే సరిపోదా?
జ: పూర్వం వెయ్యికాళ్ల మండపం కట్టిన వాళ్లు సంప్రదాయం, సిద్ధాంతం తెలిసి కట్టారు. తిరుమల పాలకమండలి అనేది కొందరిని స్వామి సేవకులుగా గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పెద్దాయన (వేంకటేశ్వరస్వామి)కే దీని మీద దృష్టి కలగాలి. అప్పుడే వీళ్లకి కట్టాలనే ఆలోచన పుడుతుంది.
ప్ర: నామాల విషయంలో జరుగుతున్న వివాదం గురించి మీరేమంటారు?
జ: వైఖానస ఆగమంలో బొట్టు ఎలా పెట్టుకోవాలో చక్కగా చెప్పబడింది. తమిళనాడులోని పార్థసారధి దేవాలయం, వానమామలై, శ్రీవిల్లి పుత్తూ రు ఆలయాల్లో స్వామికి దిద్దే బొట్టు విషయంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకోలేదే? ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా?
ప్ర : మిరాశి వ్యవస్థ రద్దు చేయడం వల్ల ప్రసాదాల్లో నాణ్యత తగ్గిందా?
జ : మిరాశి వ్యవస్థను రద్దు చేయడం వల్ల ప్రసాదాల్లో నాణ్యత తగ్గింది. ఒకప్పుడు మిరాశి వ్యవస్థ ఉండడం వల్ల పరంపరగా ప్రసాదాల తయారీ గురించి తమ తర్వాతి వారికి చెప్పేవారు. రుచిగా, శుచిగా చేసేవారు. గమ్‌కాస్ అనేవారు. వారికి వంట మీద అవగాహన ఉండేది. ఎంత మంది వచ్చినా ప్రసాదం సరిపోయేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా చేశాక, ఎన్నోసార్లు పొయ్యిలు పడిపోయాయి. రాళ్లు పడిపోయాయి. క్వాలిటీ బాగుండడంలేదు. ఫంగస్ ఫార్మవవు తుంది. అప్పటికంటే రెట్టింపు జీతం ఇస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు బాగుండాలి కదా. ఇదంతా మిరాశి వ్యవస్థ రద్దు చేయడం వల్లే. ఏదైనా పరంపరగా కొనసాగడం వల్ల అప్పట్లో దేవుడి మీద భక్తి, పనిమీద శ్రద్ధ ఉండేవి. తర్వాతి తరానికి దాన్ని అందించడం జరిగేది.
ప్ర: ఈ ‘విపరీత పోకడలను అరికట్టడానికి’ రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తీసి, హిందూ వాదంగా ప్రకటించాలని కొందరి వాదన. దీనికి మీరేమంటారు?
జ: అంత అవసరం లేదు. మైనార్టీలకు వాళ్ల స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది కదా!
ప్ర: రామానుజుల వెయ్యేళ్ల పండుగను పురస్కరించుకొని సమత స్ఫూర్తి కేంద్రం అనే పెద్ద ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే 2017 సంవత్సరానికి దీన్ని పూర్తిచేస్తారా?
జ: అవును, తొలివిడత 2017నాటికి పూర్తవుతుంది. 108అడుగుల రామానుజుల పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన, ఆ విగ్రహాన్ని 106 అడుగుల పీఠం మీద నిలబెడుతాం. దాని చుట్టూ 108 దివ్య దేశాలు రావాలి. అందుకు టెక్నాలజీని వాడాలి. వేదాలను ప్రొటెక్ట్ చేయాలి. అన్ని భాషల్లోకి టెక్నాలజీని ఉపయోగించుకొని అనువాదం చేయగలి గాలి. మొత్తం ప్రాజెక్టు ఖరీదు వెయ్యి కోట్లు.
ప్ర: ఇంత పెద్ద ప్రాజెక్టును తలకెత్తుకొని ఇన్ని వందల కోట్లు ఖర్చు చేయా లా? దానిని మంచి పనులకు వినియోగించొచ్చు కదా?
జ: క్రికెటర్ ఆడుతున్నారు, హర్స్ రేస్‌లు, హాకీలు ఆడుతున్నారు, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది అలా కాదు కదా. వ్యక్తి ఆరాధన కూడా కాదు. రామానుజుల ఆలోచనల సమూహం.
ప్ర: యాదగిరిగుట్టను పర్యాటక కేంద్రంగా ఎందుకు మార్చాలనుకుంటు న్నారు?, గర్భాలయ పవిత్రత దెబ్బతినే అవకాశం లేదా?
జ: శాస్త్రీయమైన విధానంలోనే రూపకల్పన చేస్తున్నారు. ఉన్నదాని పవిత్ర తను పాడు చేయకుండా ఉపయోగానికి తగ్గట్టుగా తయారు చేస్తున్నారు.
ప్ర: మరో తిరుపతిలాగా కట్టాలనా?
జ: తిరుపతి లాగా అనే పోలిక పెట్టుకోకూడదు. అక్కడ ఎంతవరకు మంచిని చేయగలిగే అవకాశం ఉంది. అన్నది చూడాలి. నియమాలకు విరుద్ధం కానంతసేపు అది మంచిదే. గర్భాలయానికి మూడు ద్వారాలు పెడుతామంటే అది అంగీకారం కాకపోవచ్చు.
ప్ర: శివాలయాలను పునరుద్ధరించారా?
జ: చాలా శివాలయాలు బాగు చేయించాం. వైదిక సంప్రదాయానికి అనువైన వాటిని పట్టించుకోవాలన్నదే మా భావనం. సంప్రదాయం, కట్టుబాట్లు పాడవకుండా చూడడమే మా బాధ్యత.
ప్ర: వేంకటేశ్వరున్ని సప్త సముద్రాలు దాటించి కలాణోత్సవాలు చేయడం ఎంతవరకు సబబు?
జ: సముద్రం మీద నుంచి వెళ్తే తప్పు, ఆకాశం మార్గం కాబట్టి తప్పు లేదు. అయినా, మూల విరాట్టును గాని, ఉత్సవమూర్తులను గాని తీసుకెళ్లడం లేదు. బయటి విగ్రహాలను మాత్రమే తీసుకెళ్తున్నారు. వాటి నుండి బిజి నెస్ చేయాలనుకున్నప్పుడు అది తీసుకువెళ్లిన వాళ్లే ఆలోచించుకోవాలి.
ప్ర: మీ ముందున్నటువంటి పెద్ద లక్షం ఏమిటి?
జ: వేద సంరక్షణ, వేదాల మీద పరిశోధన, వేదాల గ్రంథాలయాల స్థాపన.
ప్ర: నేటి యువతకు మీరిచ్చే సందేశం
జ: వీలైనంత వరకు విలాసాలను తగ్గించి, సమాజానికి అవసరమైన సేవల ను అందించాలి. గ్రంథాలను చదవడం, చూడడం, వినడం యువత చేయాలి. వాటిని మనసులో పునాదిగా పెట్టుకొని సమాజానికి సేవ చేయగలగాలి.