Home జాతీయ వార్తలు పివికి ‘భారత రత్న’ ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన స్వామి

పివికి ‘భారత రత్న’ ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన స్వామి

Subramanian Swamyన్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన దివంగత మాజీ ప్రధాని, కాంగ్రెస్ దిగ్గజం పివి నరసింహారావుకు భారత రత్న ప్రకటించాలని బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, 2019 గణతంత్ర దినోత్సవం నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పివి నరసింహారావుకు భారత రత్న ప్రకటించాలి అని పేర్కొన్నారు. అప్పటి నరసింహారావు ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధినే ఇప్పటి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోందని స్వామి తెలిపారు.

14.9.94న పివి నరసింహారావు ప్రభుత్వం(నేను అందులో క్యాబినెట్ ర్యాంక్ పదవిలో ఉన్నాను) సుప్రీంకోర్టుకు ఒక ప్రకటన చేసింది. పరిష్కారాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..మసీదుకు పూర్వం అక్కడ ఒక హిందూ దేవాలయం లేదా కట్టడం ఉండి ఉంటే హిందూ సమాజం అభీష్టానికి మద్దతుగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. అందుచేత నరేంద్ర మోడీ మీరా పని చేయండి, అని స్వామి ట్వీట్ చేశారు.

Swamy Appeals To Centre to bestow Bharat Ratna to PV, Swamy says that PV the construction of Ram temple in Ayodhya