Search
Monday 24 September 2018
  • :
  • :

నాన్నకు ప్రేమతో.. కూతురు

మెడిసిన్ వదులుకుని రెవెన్యూ సర్వీసు వైపు
మనతెలంగాణ ఇంటర్వూలో “గద్వాల ఆర్‌డిఒ కె.స్వర్ణలత”

             Swarna-latha

గద్వాలప్రతినిధి: టైటిల్ చూసి సినిమా కథ అనుకోవద్దు… నిజంగానే తండ్రి కోసం కూతురు సాధించిన లక్షం గురించి చదివితే మీకే అర్థమవుతుంది. మనకు తెలిసిన వాళ్లు, బంధు వులు.. చిన్నపుడు చదువుకుని ఏమి అవుతావు…. అని ప్రశ్నిస్తే డాక్టర్ అవుతాను అని చెబితే కుటుంబ సభ్యులంతా ఆనందపడిపోతారు… ఇలాగే పట్టుదలతో కష్టపడి చదివి వరంగల్ ల్లోని కాకతీయ మెడికల్ కాలేజి డాక్టర్ సీటు సాధించారు.. అయితే అక్కడ ల్యాబ్‌లో జరిగే డిసెక్షన్, మానవుని అస్తిపంజరం… అంతా గజిబిజిగా అనిపించేది. వీటన్నింటిని చూసి కష్ట పడి సాధించుకున్న డాక్టర్ సీటును ఒకటిన్నరేళ్లకే వదిలేశారు… దీంతో ఇంట్లో వాళ్లు అందరు కూడ బాధపడ్డారు.. ముఖ్యంగా తనకు అన్ని విషయాల్లో అండదండలు గా ఉన్న తండ్రి మరిం త బాధపడ్డారు… అయితే కుటుంబ సభ్యులు పడుతున్న బాధకు కదిలిపోయి ముఖ్యంగా తండ్రి బాధను తీర్చాలంటే అంతకు మించి సాధించాలని లక్షాన్ని పెట్టుకున్నారు… అలా పెట్టుకోవడమే కాదు… అందుకు నిరంతరం కృషి చేశారు.. చివరకు అనుకున్న లక్షం సాధించి రెవెన్యూ సర్వీసులోకి అడుగుపెట్టారు… ఆమే గద్వాలకు నూతనంగా వచ్చిన ఆర్డీవో కె.స్వర్ణలత. ఒక రకంగా చెప్పాలంటే ఆర్డీవో స్వర్ణలతది ఇటివలీ తెలుగులో బాగా హిట్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాను తలపిస్తుంది… సినిమాలో తండ్రి కోసం కష్టపడే కొడుకు లను చూస్తాం… ఇక్కడ కూతు రిని చూస్తాం…. అంతే తేడా… గద్వాలకు వచ్చిన ఆర్డీవో స్వర్ణల త తో మనతెలంగాణ ఇంటర్వూ చేసింది.. ఇంటర్వూ సాగిన తీరు ఇలా.

మ.తె: మీ కుటుంబ నేపథ్యం… మీ స్వస్థలం గురించి చెబుతారా..?

ఆర్‌డిఒ: మాది కరీంనగర్ పట్టణం. భర్త రత్నాకర్ కేద్ర రక్షణ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా హైదారాబాదులో విధులు నిర్వర్తిస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు బాబు ఇటివలీ ఇంటర్ పూర్తయి ఎంసెట్ రాశాడు.. పాప ఇంటర్మీడియట్ రెండవ సంత్సరం చదువుతుంది. మా నాన్న కురుమయ్య జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశారు. ముందు నుంచి కూడ నాన్న నన్ను డాక్టర్‌ను చేయాలనే లక్షంతో చదివించారు. మా నాన్న ప్రోద్బలంతో నేను కూడ కష్టపడి చదివి వరంగల్‌ల్లోని కాకతీయ మెడికల్ కాలే జిలో డాక్టర్ సీటును సాధించాను. దీంతో మాఇంట్లో ముఖ్యంగా మానాన్న ఆనందానికి అవధుల్లేవు.. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ నేను కాలేజిలో చేరి క్లాసులకు వెళ్లే సరికి నా మనస్తత్వానికి క్లాసులో జరుగుతున్న తీరుకు పూర్తి భిన్నంగా ఉండేది… ల్యాబ్‌లో డిసెక్షన్, మానవుని అస్తిపంజరం, పుర్రె…. ఇలా అన్నింటిని చూసేసరికి బాగా ఇబ్బంది పడ్డాను. ఒకటిన్నరేళ్లుగా బలవంతంగా చదివిన తరువాత… ఇక నా వల్ల కాదంటూ మానాన్నతో చెప్పేసి మధ్యలోనే ఆపేశాను. దీంతో మానాన్న చాలా బాధపడ్డారు.. అప్పటికే నాన్న ఫ్రెండ్స్‌తో, బంధువులతో నాకూతురు డాక్టర్ అని చాలా గొప్పగా చెప్పుకున్నారు.. కాని నానిర్ణయం నాన్నకు బాధను కలిగించింది… ఇది గమ నించిన నేను ఎలాగైన నాన్న బాధను తీర్చాలంటే అంతకు మించి ఏదో సాధించాలని గట్టి నిర్ణయానికి వచ్చాను. ఆ క్రమంలోనే గ్రూప్స్ వైపు దృష్టి సారించాను. అందుకు అవసరమైన డిగ్రీని ఒన్‌సిటింగ్ ద్వారా పూర్తి చేశాను. కరెక్టుగా అదే సమయంలో నాకు 1997లో వివాహాం జరిగింది. అయితే గృహిణిగానే ఉంటూనే నాలక్షాన్ని మరచిపో లేదు. గ్రూప్స్‌కు సంసిద్ధమైయ్యాను. తరువాత రెండేళ్లకు అంటే 1999లో గ్రూప్స్ నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడిన సంవత్సరానికి అంటే 2000 సంవత్సరంలో పరీక్షలు నిర్వహించారు. తరువాత 2004లో ఫలితాలు వెల్లడించారు. ఈనాలుగేళ్లు ఇంట్లోనే ఖాళీగా కూర్చునకుండా బీ.ఎడ్ రెగ్యురల్ కోర్సు పూర్తి చేశాను. గ్రూప్-2లో నేను ఎంపిక అవ్వడం జరిగింది. దీంతో మానాన్న చాలా సంతోషపడ్డారు. అయితే రామేశ్వరం పోయినా… శనీశ్వరం తప్పదు అన్నట్లు ఇక్కడా కూడ శవాల పంచనామా పంచాయతీలు….? వంటివి ఎదురవుతున్నాయి.

మ.తె: మీ మొదటి పోస్టింగు ఎక్కడా…?

ఆర్‌డిఒ: నాకు మొదటి పోస్టింగు డిప్యూటీ తహశీల్దార్‌గా 2006లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పనిచేశాను. అక్కడి నుంచి బోయిన్‌పల్లి, తదితర ప్రాంతాల్లో పనిచేశాను.

మ.తె: తహశీల్దార్‌గా ఎపుడు పదోన్నతి లభించింది…?

ఆర్‌డిఒ: 2009లో తహశీల్దార్ పదోన్నతి లభించింది. బీరుదేవరపల్లి మండలంలో తహశీల్దార్‌గా పనిచేశాను. తరువాత కరీంగనగర్ కలెక్టరేట్, పాలకుర్తిలో విధులు నిర్వహించడం జరిగింది.

మ.తె: ఆర్డీవోగా ఎపుడు పదోన్నతి లభించింది…?

ఆర్‌డిఒ:ఖమ్మం జిల్లా పాల్వంచలో డివిజనల్ ఏవో పనిచేస్తూనే ఇంఛార్జీ ఆర్డీవోగా పనిచేయడం జరిగింది. అనంతరం కల్లూరుకు బదిలిపై వెళ్లాను. అక్కడ పనిచేస్తూనే ఆర్దీడీవోగా పదోన్నతి లభించి నేరుగా గద్వాలకు రావడం జరిగింది.

మ.తె: కొత్తగా వచ్చిన మీరు ఎలాంటి లక్షాలను పెట్టుకున్నారు…?

ఆర్‌డిఒ: బాధ్యతలు తీసుకుని ఇంకా మూడు రోజులే అయ్యింది. ముందుగా డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు క్షేత్రస్థాయిలో వెళ్లి తెలుసుకుంటాను. మండలంలో తహశీల్దార్‌తో పాటు వీఆర్‌వో, వీఆర్‌ఏలతో మండలంలోని అన్ని గ్రామాలపై సమీక్ష నిర్వహిస్తాను. అధేవిధంగా ప్రభుత్వ భూముల వివరాలు… ఎక్కడైనా అన్యాక్రాంతమై య్యాయా…? అయితే వాటిని గుర్తించారా…? ఎలాంటి చర్యలు తీసుకున్నారు…? ప్ర స్తుతం వాటి స్టేటస్ వంటి విషయాలపై దృష్టిపెడతాను. అధేవిధంగా సమస్యల పరిష్కా రం కోసం నాదగ్గరకు వచ్చిన ప్రజలతో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిం చేందుకు కృషి చేస్తాను. కష్టపడి చదివితే అనుకున్న లక్షాలను సాధించవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు బాగా కష్టపడి చదివితే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. చదువే అన్నింటికి పరిష్కార మార్గం.

Comments

comments