Home జాతీయ వార్తలు మహిళల రక్షణకు స్వాతి యాప్

మహిళల రక్షణకు స్వాతి యాప్

SWATIచెన్నయ్ : చెన్నయ్‌లోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇటీవల హత్యకు గురైన తమ సంస్థ ఉద్యోగిని స్వాతి పేరిట ఇన్ఫోసిస్ సంస్థ ఒక యాప్ రూపొందిస్తోంది. రైల్వే రక్షక దళం మహిళల రక్షణ కోసం ప్రత్యేకించి ఒక యాప్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించగా, దీన్ని రూపొందించిన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగిని స్వాతి జాపకార్థం దానికి ఆమె పేరు పెట్టింది. దీనిని వచ్చే నెలలో ఆవిష్కరించనున్నారు.