Home జాతీయ వార్తలు ఐదో రోజుకు చేరిన స్వాతి దీక్ష

ఐదో రోజుకు చేరిన స్వాతి దీక్ష

SWATI

ఢిల్లీ : మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరి శిక్ష వేయాలని కోరుతూ ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ చేపట్టిన దీక్ష సోమవారంతో ఐదు రోజుకు చేరుకుంది. రాజ్‌ఘాట్ వద్ద ఈనెల 12వ తేదీన ఆమె తన నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం స్వాతికి వైద్య పరీక్షలు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మహిళలు, చిన్నారి బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కావాని స్వాతి పేర్కొన్నారు.

Swati Inmates at Rajghat in Delhi