Home అంతర్జాతీయ వార్తలు ఒక్కొక్కరు2-3 పెళ్లిలు చేసుకొండి..లేకపోతే యావజ్జీవ శిక్షే

ఒక్కొక్కరు2-3 పెళ్లిలు చేసుకొండి..లేకపోతే యావజ్జీవ శిక్షే

Swazi-King

స్వాజిలాండ్: ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. అదేంటంటే ఆ దేశంలో పెళ్లిడుకొచ్చిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని, అదికూడా 2019 జూన్ నెల పూర్తి అయ్యేలోపు చేసుకొవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని రాజు హెచ్చరించారు.అయితే 5గురు మహిళలను పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. రాజు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేమిటంటే.. ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారట. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా పిలుస్తారు. స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలని రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Swazi King Directs Men To Marry More Wives Or Risk Jail