Home లైఫ్ స్టైల్ చెమట వాసన తొలగించుకోండిలా…

చెమట వాసన తొలగించుకోండిలా…

Sweat-smell-image

ఎండాకాలం వచ్చిందంటేచాలు భగ్గున మండే ఎండలు మాడ్చి వేస్తాయి. చర్మం కందిపోతుంది. వేసవి పొక్కులతో పేలిపోతుంది. చర్మం చిట్లిపోతుంది. జుట్టూ, చర్మం కళావిహీనమైపోతుంది. ఈ మూడు  నాలుగు నెలలు చర్మ సౌందర్యం దెబ్బతిని పోకుండా కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలి. చర్మానికి వేగంగా కాపాడుకోడానికి ఉపయోగపడేవి బాత్ అయిల్స్. వీటి వల్ల చర్మం కాంతి  తగ్గిపోకుండా ఉండడమేకాదు ఒళ్ళంతా పరిమళిస్తూ మనసుకు హాయిగొలుపుతుంది. చెమట వాసనకు తక్షణ విరుగుడు బాత్ ఆయిల్. ఎండా కాలం ఏం చేస్తే చర్మకాంతి వసివాడిపోకుండా బైటపడవచ్చో  చూద్దాం.

* రోజ్ వాటర్ ఆలివ్ ఆయిల్‌ను బాగా మిక్స్ చేసుకుని.. హాట్ వాటర్‌లో కలిసి స్నానం చేస్తే ఫలితం బాగా ఉంటుంది.
* ఫ్రెష్ రోజా రేకులను హాట్ వాటర్ లో వేసి స్నానం చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ పొందవచ్చు.
* రోజూ బాత్ ఆయిల్స్‌తో స్నానం చేస్తే ప్రత్యేకంగా సెంట్, పెర్‌ఫ్యూమ్‌లను వాడాల్సిన అవసరం ఉండదని బ్యూటీషియన్లు అంటున్నారు.
* జాస్మిన్ ఆయిల్‌ను కూడా హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకుని స్నానం చేస్తే సువాసన అదరగొడుతుంది.
* సాండిల్ వుడ్ ఆయిల్, లావెండ్ ఆయిల్ చర్మానికి మరింత వన్నె తెస్తాయి.
* 10చుక్కల ల్యావెండర్ ఆయిల్లో 5 చుక్కల జాస్మిన్ ఆయిల్‌ను స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి హాట్ షవర్ బాత్ చేసుకోచ్చు.
* షాంపూ బేస్డ్ ఆయిల్స్ అంటే బాదం ఆయిల్, బేబీ షాంపు, ఇతర ఎసెన్షియల్‌ను మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.
* చెమట వాసన పోవాలంటే గోరువెచ్చని నీటిలో వేపాకు వేయాలి. వేపాకు రసం దిగాక ఆ నీటితో స్నానం చేయొచ్చు.
* నీళ్ళలో కర్పూరం వేసుకుని స్నానం చేస్తే చెమట వాసన మాయం.
* గులాబీ, తులసి ఆకులతో కూడిన క్రీములు వాడితే చర్మం మెరుస్తుంది.
* హెర్బల్ షాంపూలు కూడా జుట్టుకి సహజ ఔషధంగా పనిచేస్తున్నాయి.
* చర్మంపై మచ్చలు, మొటిమలు, చెమట కాయలు తొలగిపోవాలంటే.. స్నానం చేసేముందు అలోవెరా గుజ్జును చర్మానికి పట్టించాలి.
* నిమ్మరసం, తులసి పేస్టును చర్మానికి రాస్తే మంచి ఫలితం వుంటుంది.
* చర్మం పైపొర మీద తేమ శాతాన్ని కాపాడేందుకు రసాయనాలు కలిపిన సబ్బులు కాకుండా హెర్బల్ సబ్బులు వుపయోగించాలి.
* తేనె, తులసి, అల్లం, అలోవెరా, నిమ్మ కలిపిన హెర్బల్ సబ్బులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
* సబ్బులో ఉండే నిమ్మ చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి, రంగు మారకుండా మచ్చలు ఉండకుండా కాపాడుతుంది.
* చర్మం పొడిబారకుండా, చర్మ వ్యాధుల నుండి కలబంద కాపాడుతుంది.
* మల్లె పువ్వుల రసాన్ని కలిగివుండే లోషన్ లేదా క్రీములను వాడటం వల్ల చర్మం తేమగా..ఆరోగ్యంగా ఉంటుంది.
* మల్లెపూవులలో వుండే యాంటీ మైక్రోబియల్, సెప్టిక్ గుణాలు తలపై వున్న చర్మంలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
* కొబ్బరి నూనెలో మల్లెపూవుల నూనెను కలిపి తలకు రాసుకుని మెల్లమెల్లగా మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా నిద్రపోవచ్చు.
* జాస్మిన్ స్ప్రే కూడా వేసవిలో హాయి గొలుపుతుంది. జాస్మిన్‌తో చేసిన నూనెను జుట్టుకు పట్టిస్తే మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
* వేసవిలో ఆయిల్ ఫ్రీ సోపులు, ఫేస్ వాష్‌లను వాడటం మంచిది. బయట తిరిగే వారు ఆరెంజ్, నిమ్మరసాలను తీసుకోవడం అవసరం.
* చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌తో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
* చుక్కల నిమ్మరసం నీటిలో కలిపి స్నానం చేస్తే సౌందర్యం, మృదుత్వంతోపాటు విటమిన్-ఇ లభిస్తుంది.
* ఆరోగ్యకరమైన హెయిర్ కోసం ద్రాక్షరసం అర కప్పు, జాస్మిన్ ఆయిల్ మూడు స్పూన్లు, రోజ్ మేరీ ఆయిల్ మూడు చుక్కలు తీసుకుని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది.
* రోజ్ వుడ్, గంధం, నిమ్మ కలిపిన నీటితో స్నానం చేస్తే శరీరం మృదువుగా తయారవుతుంది.
* ఆపిల్, అరటి, పుచ్చ, టమోటా, కీరదోస, కొబ్బరి నీరును ముఖానికి అప్లై చేయొచ్చు. సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవారు దీన్ని వాడకూడదు.
* రోజూ రెండు ముల్లంగి దుంపలు తినండి. రోజుకు రెండు దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే శరీర కాంతి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* మెంతులు బాగా నూరి ముఖానికి మర్దన చేసుకుని, గంటతర్వాత స్నానం చేస్తే ముఖం చాలా మృదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి శుభ్రంగా ఉంటాయి.