Home తాజా వార్తలు విద్యార్థినిపై స్వీపర్ అత్యాచారయత్నం

విద్యార్థినిపై స్వీపర్ అత్యాచారయత్నం

Rape-Attemptగోదావరిఖని: స్థానిక గాంధీనగర్‌లోని గాంధీపార్క్ మండల పరిషత్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న సర్వర్ (50) అత్యాచారానికి యత్నించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక అశోక్‌నగర్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న విద్యార్థిని తండ్రి దామెర నరేష్ ఈనెల 21న ఉదయం 8గంటలకు తన కుమార్తెను పాఠశాలలో దించి వెళ్లాడు. తన క్లాస్‌రూమ్‌లో సదరు విద్యార్థిని రాసుకుంటుండగా, నిందితుడు సర్వర్ క్లాస్‌రూమ్‌లోకి వచ్చి డోర్ పెట్టి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, ఇంతలో ఎవరో తలుపు కొట్టగా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరించినట్లు తెలిపారు.

ఇదే విద్యార్థినిని 4వ తరగతిలో ఉన్నప్పుడు కూడా నిందితుడు సర్వర్ ఇదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. ఈ విషయమై పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, గోదావరిఖని ఏసిపి ఉమేందర్, వన్‌టౌన్ సిఐ పర్శ రమేష్ సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలిని, తండ్రిని విచారించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సిఐ పర్శ రమేష్ తెలిపారు.

Sweeper Tries to Rape Girl in Class room in Karimnagar