Home దునియా కృత్రిమ తీపితో చేటు!

కృత్రిమ తీపితో చేటు!

Sweeteners

 

చక్కెరకు బదులుగా కృత్రిమ తీపిని తీసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏ ఆరోగ్య ప్రయోజనాన్ని ఆశించి కృత్రిమ తీపిని తీసుకుంటున్నారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవచ్చంటున్నారు పరిశోధకులు. ఇదే విషయం మీద ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. చక్కెరకు బదులుగా స్వీటెనర్లను వాడడం వల్ల పెద్ద ప్రయోజనాలేవీ కలగవనే విషయం వీరి అధ్యయనంలో తేలింది. కృత్రిమ చక్కెర తీసుకోవడం వల్ల పెద్దవారిలో బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) తగ్గగా, పిల్లల్లో మరింత పెరిగిన విషయాన్ని వీరు గుర్తించారు. అయితే డయాబెటిస్ ఉన్న వారిలో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే చాలా తక్కువ అధ్యయనా ల్లో మాత్రమే ఈ విషయం స్పష్టమైందంటున్నారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు నిర్వహించాలని వారు అంటున్నారు. చక్కెరకు బదులు కత్రిమ తీపిని ఉపయోగించే వారు వైద్యుల సలహా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

 

Sweeteners are not Good Health

 

Sweeteners are not Good Health