Friday, April 19, 2024

ఎర్రగడ్డలో కానిస్టేబుల్‌కు, గాంధీలో గర్బిణీకి స్వైన్‌ప్లూ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,హైదరాబాద్: నగరంలో ఒక పక్క కరోనా వైరస్ కంగారెత్తిస్తుండగా, మరోపక్క స్వైన్‌ప్లూ దడ పుట్టిస్తుంది.దీంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఓ పోలీసు కానిస్టేబుల్‌కు స్వైన్‌ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. నగరంలోని ప్లేటబురుజులో 9మంది ఏఆర్ కానిస్టేబుళ్లు అస్వస్దతకు గురికాగా వారిని వెంటనే ఉన్నతాధికారులు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారిలో ఒకరికి స్వైన్‌ప్లూ సోకినట్లు గుర్తించారు. మిగిలిన 8మందిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. స్వైన్‌ప్లూ సోకిన ఒక కానిస్టేబులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందని రెండురోజుల్లో డిశ్చార్జి చేస్తామని ఎర్రగడ్డ చాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు.
గాంధీలో గర్బిణీకి స్వైన్‌ప్లూ: గాంధీలో ఆసుపత్రికి జ్వరంతో వచ్చిన గర్భిణీని వైద్యులు పరీక్షలు చేయగా స్వైన్‌ప్లూ సోకినట్లు గుర్తించారు. ఆమెకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. 15రోజుల కితం ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన గర్బిణీకి స్వైన్‌ప్లూ సొకితే గాంధీలో చేర్చితే ఆమె ఐదురోజులపాటు చికిత్స పొంది మృతిచెందింది. దీంతో వైద్యులు స్వైన్‌ప్లూ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్సలు సకాలంలో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Swine Flu Case Found in Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News