Home Default అనుకున్న సమయానికి రావడం కష్టమే

అనుకున్న సమయానికి రావడం కష్టమే

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది కానీ బ్యాలెన్స్ మాత్రం భారీగా ఉంది. వచ్చే మంగళవారం నుంచి చెన్నైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ కీలకమైన షెడ్యూల్ చెన్నైలో మూడు వారాల పాటు కొనసాగనుంది. అక్కడ నయనతార సీన్స్‌తో పాటు ఒక పాటను కూడా చిత్రీకరిస్తారు. జలపాతాల నేపథ్యంలో నరసింహారెడ్డి అజ్ఞాతంలో ఉన్నప్పటి సన్నివేశాలతో పాటు చిరు, నయన్‌ల మీద బీట్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నారు. అయితే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. దీంతో అభిమానులకు కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్‌కు చాలా సమయం పడుతుంది. ఈ పనులన్నింటికీ కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్న మే 9న ‘సైరా నరసింహారెడ్డి’ రావడం కష్టమే. షూటింగ్ మొత్తం పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టడానికే ఫిబ్రవరి వచ్చేలా ఉంది. అలాంటప్పుడు విజువల్ ఎఫెక్ట్ పూర్తిచేసి మే నెలలో సినిమాను విడుదల చేయడం జరుగని పని. ఒకవేళ చేద్దామనుకొని క్వాలిటీలో రాజీ పడితే అవుట్‌పుట్‌లో తేడా రావచ్చు. అలా కాకుండా అన్నీ సాఫీగా పూర్తిచేసి దసరా పండుగకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో నిర్మాత రామ్‌చరణ్ ఉన్నట్లు తెలిసింది.

Sye Raa Movie Release Date Might Extend 

Telangana News