Search
Monday 24 September 2018
  • :
  • :

‘సైరా’ క్లైమాక్స్‌లో మార్పు?

Sye Raa Narasimha Reddy Climax Scene Revealed

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. తెలుగులో ‘బాహుబలి’ తర్వాత ఈమధ్య కాలంలో అంతటి గుర్తింపు, క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రమిదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ పది సంవత్సరాల క్రితమే తయారుచేసుకున్నారు. ఇక ముందుగా అనుకున్న కథ ప్రకారం నరసింహారెడ్డిని బ్రిటీష్ వారు ఉరి తీయడంతో సినిమా పూర్తవుతుందట. తెలుగులో యాంటీ క్లైమాక్స్ చిత్రాలు చాలా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే క్లైమాక్స్ విషయంలో స్క్రిప్ట్‌ను మార్చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ సభ్యులు ఉన్నట్లు తెలిసింది. క్లైమాక్స్ మార్చితే ఎలా ఉంటుందని చర్చలు జరుపుతున్నారట. ప్రీ క్లైమాక్స్‌గా నరసింహారెడ్డి మరణాన్ని చూపించి… క్లైమాక్స్‌గా స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఇతర స్వాతంత్య్ర సమరయోధుల గురించి చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. క్లైమాక్స్ విషయంలో ప్రస్తుతం సినిమా యూనిట్ సభ్యులతో పాటు మెగా కుటుంబ సన్నిహితులు కూడా తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే క్లైమాక్స్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Comments

comments