Search
Monday 24 September 2018
  • :
  • :

సైరాలో మరో మెగా హీరో..?

Another Mega Family Hero Will acting in Sye Raa Narasimha Reddy Movie

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో అదరగొట్టారు. సుమారు దశాబ్దం తర్వాత ఆయన హీరోగా చేసిన ‘ఖైదీ నెం.150’ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే విషయం ప్రూవ్ అయింది. దీంతో చిరుతో సినిమాల కోసం దర్శకనిర్మాతలు క్యూకడుతున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి సైరా మూవీతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతోంది సైరా న‌ర‌సింహ‌రెడ్డి. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత కథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలె రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ను రప్పించింది చిత్ర యూనిట్. చిరు తనయుడు రాంచరణ్ మూవీని భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ స్టార్లు నటిస్తున్నారు.

Sye Raa Narasimha Reddy with Gona Ganna Reddy

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పాటు, విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు లాంటి స్టార్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా ఒక ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుందని సమాచారం. అయితే, తాజాగా ఈ చారిత్రాత్మక చిత్రంలో మరో మెగా హీరో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఆయనెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకుముందు బన్నీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి అల‌రించిన విషయం తెలిసిందే. సైరాలోనూ ఇలాంటి పాత్రలోనే క‌నిపించ‌నున్నాడ‌ట‌. గోన గన్నారెడ్డిగా ఆకట్టుకున్న బన్నీ మ‌రి సైరాలో ఎలాంటి గెట‌ప్‌తో సంద‌డి చేస్తాడో చూడాలి. బన్నీ, సురేంద‌ర్ రెడ్డి కాంబోలో వచ్చిన రేసుగుర్రం మంచి విజయం సాధించింది. ఈ పరిచయంతోనే అర్జున్ ను సైరాలో నటింపచేస్తున్నాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ తెగ హల్ చల్ చేస్తోంది. అంతేగాక మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా సైరాలో క‌నిపించ‌నున్నాడ‌ని పుకార్లు వస్తున్నాయ. కాగా, వీటిపై చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే ఇంకోన్ని రోజులు ఆగాల్సిందే.

Comments

comments