Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘సైరా…’కు సిద్ధమవుతున్నారు

chiru

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా… నరసింహారెడ్డి’ పూజా కార్యక్రమాలు జరిగి చాలా కాలమైనా ఇప్పటి వరకు ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం రిహార్సల్స్ పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉందట. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రంలో పోరాటయోధుడిగా కనిపించబోతున్నాడు చిరంజీవి. ఇందుకోసం అతను భారీగా గడ్డం పెంచేశాడు. ఇక ఈ చిత్రాన్ని తమ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం అతను సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తూనే తండ్రి చిరంజీవి 151వ చిత్రం ప్రొడక్షన్ పనులు కూడా చూస్తున్నాడు. సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణపు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అన్ని పనులు ప్రణాళిక ప్రకారమే జరిగి సినిమా విజయవంతం కావాలని చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి సోమవారం ఉదయం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంపై మెగా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

comments