Home తాజా వార్తలు ‘సైరా’ టీజ‌ర్ వచ్చేసింది…

‘సైరా’ టీజ‌ర్ వచ్చేసింది…

Sye Raa Narasimha Reddy Teaser Released

హైదారబాద్: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరు బ‌ర్త్‌డే కానుకగా కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ మూవీ టీజర్ ను విడుదల చేసింది.  బుధవారం (ఆగ‌స్ట్ 22న‌) చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కి టీజ‌ర్‌తో గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్‌. చిరు త‌ల్లి అంజ‌న‌మ్మ ఈ టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ మెగా అభిమానులను అలరించే విధంగా ఉంది. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ తో ఈ అంచనాలు తార స్థాయికి చేరాయి. చిరు తనయుడు రాంచరణ్ మూవీని భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ స్టార్లు నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పాటు, విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు లాంటి స్టార్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా ఒక ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుందని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందిస్తున్న ‘సైరా’ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.