Home తాజా వార్తలు దసరా సెలవులు కలిసి వస్తాయని…

దసరా సెలవులు కలిసి వస్తాయని…

chiranjeevi

 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం శబ్ధాలయ స్టూడియోస్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన చిరు… తాజాగా తన పార్ట్ డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లు తెలిసింది. అలాగే ఆగస్ట్ మూడవ వారం వరకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయట. ఇక చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

అక్టోబర్ 2న విడుదల చేస్తే… రెండో వారం నుండి దసరా సెలవులు కూడా తమ సినిమాకు కలిసి వస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు నటించారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా చేసింది. భారీ బడ్జెట్ తో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Sye Raa Narasimha Reddy to Release On October 2nd 2019