Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

35 రోజుల్లో భారీ యుద్ధ సన్నివేశాలు

Chiru

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు  విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమ న్నా వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నా రు. బాహుబలి రేంజ్‌లో ఈ చిత్రాన్ని ని ర్మించేందుకు నిర్మాత రామ్‌చరణ్ భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తా జాగా ఈ చిత్రంలోని అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశం షెడ్యూల్ ముగిసింది. ప్రతికూల పరిస్థితుల్లో కేవలం 35 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగించారట. ఈ యాక్షన్ పార్ట్ గురించి సినిమా కెమెరామెన్ రత్నవేలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి ని చిరంజీవి ప్రశంసల్లో ముంచెత్తారని తెలిసింది. బ్రిటిష్ ఆయుధాగారంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి దండెత్తే కీలకమైన సన్నివేశం కోసం హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. బ్రిటిష్ సైన్యం, ఫిరంగులు, గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే వర్షంతో పా టు వెలుతురులేమి ఈ షూటింగ్‌కు ఆటం కం కలిగించాయని… అయినప్పటికీ విజయవంతంగా షూటింగ్ ముగించామని ఫి ల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. కీలకమైన యుద్ధ సన్నివేశాలను 35 రాత్రుల్లో తెరకెక్కించామని చెప్పారు.

Comments

comments