Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘సైరా’ స్పీడ్ పెరిగింది

Chiruమెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభించినా క్వాలిటీ కోసం నెమ్మదిగా చిత్రీకరిస్తున్నారు. అయితే నాలుగు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న కొరటాల శివ మెగాస్టార్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. దాంతో చిరంజీవి ఇప్పుడు ‘సైరా’ షూటింగ్ స్పీడు పెంచాలని దర్శకుడు సురేందర్‌రెడ్డితో అన్నాడట. ఈ ఏడాది చివరన కొరటాల శివతో  సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు చిరంజీవి. ఒక్కసారి కొరటాల షూటింగ్ మొదలుపెట్టాడంటే చకచకా పని పూర్తి చేసుకుంటూ వెళ్లిపోతాడు. అందుకనే కొరటాలతో షూటింగ్ మొదలుపెట్టే ముందు గ్రాఫిక్స్  వర్క్ తప్ప ‘సైరా’ పని మొత్తం పూర్తి చేయాల్సిందిగా  సురేందర్ రెడ్డి టీం మొత్తంపైన చిరంజీవి ఒత్తిడి పెంచుతున్నాడట. మరోవైపు సురేందర్ రెడ్డికి కూడా ఈ సినిమా పనిలో వేగం పెంచాల్సిన అవసరం వచ్చింది. అతనికి తర్వాత ఛాన్స్ కూడా మెగా కాంపౌండ్‌లోనే రావడం విశేషం. సురేందర్‌రెడ్డితో అల్లుఅర్జున్ ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. అందుకే సైరా సినిమాను త్వరగా పూర్తి చేసి బన్నీ సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభించాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు.

Comments

comments