Search
Wednesday 14 November 2018
  • :
  • :

భారీ పోరాటాల చిత్రీకరణకు సన్నాహాలు

chiru

టాలీవుడ్‌లో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రారంభించనుంది. జూన్ మొదటి వారంలో సినిమాకు సంబంధించిన కొన్ని భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. వాటితో పాటు కీలకమైన సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. అత్యంత కీలకమైన షెడ్యూల్ ఇదేనట. ఈ షెడ్యూల్‌లోని యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. జూన్ 5 నుంచి ఈ షెడ్యూల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక చిరంజీవితో పాటు మరికొంత మంది స్టార్ నటీనటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రామ్‌చరణ్ తమ హోమ్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విజువల్ ఎఫెక్ట్‌కు సంబంధించిన పనులను కూడా ఎప్పటికప్పుడు పూర్తిచేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ తారలు అమితాబ్ బచ్చన్, విజయ్‌సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నాతో పాటు జగపతిబాబు కూడా నటిస్తుండడం విశేషం.

Comments

comments