Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

‘రంగస్థలం’ సెట్‌లో సైరా

chiru

‘రంగస్థలం’ మూవీతో ఇండస్ట్రీలోని రికార్డులను తిరగరాశాడు రామ్‌చరణ్. 80వ దశకం నాటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా రిలీజై 45 రోజులు దాటినా ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతుంది. ఈ మూవీలో నటీనటుల టాలెంట్‌తో పాటు ‘రంగస్థలం’ గ్రామం సెట్‌కు కూడా బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ శివార్లలో వేసిన గ్రామం సెట్‌ను ఇప్పటికీ తీయకుండా అలాగే ఉంచారు. చిరంజీవి 151వ సినిమా ‘సైరా… నరసింహారెడ్డి’ మూవీలో కొంత భాగాన్ని ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నారు. బ్రిటీష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా’ తెరకెక్కుతోంది. ఇది కూడా గ్రామీణ నేపథ్యంతో సాగే సినిమానే. ఇందులో కొన్ని సీన్లు పల్లెటూరిలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు పాతకాలం నాటి ఇళ్లతో కూడిన ‘రంగస్థలం’ సెట్ సరిగ్గా సరిపోతుంది. ఇక్కడి ఇళ్లలో కొన్ని మార్పులుచేర్పులు చేసి సైరా షూటింగ్ కోసం వినియోగించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే రంగస్థలం సెట్‌లో షూటింగ్ చేయబోతున్నారు.

Comments

comments