Home అంతర్జాతీయ వార్తలు సిరియాలో కాల్పుల విరమణకు ఒప్పందం

సిరియాలో కాల్పుల విరమణకు ఒప్పందం

syiraఇస్తాంబుల్: సిరియా మొత్తంలో కాల్పుల విర మణ పాటించడానికి టర్కీ, రష్యా మధ్య అంగీ కారం కుది రింది. బుధవారం ఆ ఒప్పందం అమ లు ప్రారంభ మౌతుంది. ఈ నెల మొదట్లో అలె ప్పో నగరంలో కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందాన్ని సిరియా మొత్తానికి విస్తరించాలని తాజా అంగీకారం నిర్దేశిస్తోంది. దానిని కూడా టర్కీ, రష్యాలే కుదిర్చాయి.
ఐఎస్ దాడులు: 22 మంది మరణం
తూర్పు సిరియాలో గుర్తు తెలియని విమానం సాగించిన దాడులలో 10 మంది పిల్లలతో సహా 22 మంది పౌరులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ( ఐఎస్) హూగవాదుల పట్టులోని హోజ్నా లో ఈ దాడులు సంభవించాయి. అది ఇరాక్ సరి హద్దులలోని దీర్ ఎజ్జోర్ పాంతంలోనిది. మృతు లందరూ రెండు కుటుంబాలకు చెందినవారు.