Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అర్జెంటీనా వేదికగా టి20 ప్రపంచకప్ ప్రారంభం

icc
దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగే టి20 ప్రపంచకప్ సమరానికి ప్రారంభ వేదిక ఖరారైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా జట్ల మధ్య జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అర్జెంటీనాతో పాటు బెర్ముడా, కైమాన్‌లో ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు ఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో మొత్తం 61 దేశాలు పోటీ పడనున్నాయి. అయితే ఇందులో కేవలం 5 దేశాలు మాత్రమే ఎంపికవుతాయి.ఇక, ఆసియా దేశాల కోసం జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఫిలిప్పిన్స్, పిజి, కువైట్‌లో నిర్వహించనున్నట్లు ఐసిసి పేర్కొంది.

Comments

comments