Home తాజా వార్తలు గవర్నర్‌ను కలిసిన టి-కాంగ్రెస్ నేతలు

గవర్నర్‌ను కలిసిన టి-కాంగ్రెస్ నేతలు

T-Congress Leaders met the Governor

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి 20 రోజులు పూర్తయినా , ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారాల ద్వారా స్పీకర్, సిఎస్‌పై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. అనంతరం టిపిసిసి చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి హైకోర్టుకు వీడియో పుటేజీని ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కోర్టుకు ఆ వీడియోను సమర్పించలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగిన చరిత్ర ఎన్నడూ లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చిన సంపత్‌కుమార్ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

T-Congress Leaders met the Governor