Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఈడెన్‌లో మరో రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు కావాలి: ఐసిసి

ICCకోల్‌కతా: 2016లో భారత్ టీ-20 ప్రపంచ కప్‌కి అతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్‌లో జరుగనుంది. ప్రస్తుతం ఈ స్టేడియంలో రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉన్నాయి. ఒకటి హోం టీంకి, మరోకటి అతిథ్య జట్టుకు కెటాయిస్తారు. అయితే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 3న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక్కడ పురుషుల ఫైనల్‌తోపాటు మహిళల ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే రోజు జరుగనుంది. కావున మహిళ జట్లకు రెండు అదనపు  డ్రెస్సింగ్ రూమ్‌లు కావాల్సిందిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్యాబ్‌ను కోరింది. చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరినప్పుడు కూడా షెర్-ఇ-బంగ్లా స్టేడియంలో ఇలాంటి సదుపాయమే కల్పించింది ఆ స్టేడియం అధికార వర్గం.

Comments

comments