Home సినిమా ముంబయిలో తాప్సీ డెన్

ముంబయిలో తాప్సీ డెన్

taatse

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరుతెచ్చుకొని డబ్బు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది తాప్సీ పన్ను. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది ఈ పంజాబీ బ్యూటీ. ఇటీవల ‘జుడ్వా-2’లో అందాలు ఆరబోసి బాగానే గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. బిజీ హీరోయిన్ కాకపోయినా కాల్షీట్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. హీరోయిన్‌గా ఇప్పటికీ ఆఫర్లు వస్తుండటంతో ఆమె సంపాదనకు లోటేమీ లేదని చెప్పాలి. అన్నట్టు తాప్సీకి ఓ చెల్లెలుంది. ఆమె పేరు షగున్ పన్ను. అక్కలా సినిమాల్లోకి రాకుండా వెడ్డింగ్ ప్లానర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించింది. ముంబయిలో సెలబ్రిటీలతో కాస్త పరిచయాలు ఉండటంతో షగున్‌కు చేతినిండా పని ఉంది. వరుస ఈవెంట్స్‌తో షగున్ బిజీగా ఉంది. అక్కా చెల్లెళ్లు రెండు చేతులా సంపాదిస్తుండడంతో తాజాగా ఇద్దరూ కలిసి ముంబయిలో ఓ ఇల్లు కొన్నారు. దీనికి పన్ను డెన్ అని పేరు కూడా పెట్టారు. హౌస్ టు హోమ్ అంటూ టైటిల్ పెట్టి తాము కొన్న ఇంటి ముందు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ దిగిన ఫొటోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలో నవ్వులు పూయించిన తాప్సీ తాజాగా మరోసారి తెలుగు తెరపై కనిపించనుంది. ‘రంగస్థలం’ సినిమాలో కుమార్ బాబుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న ‘నీవెవరో’ సినిమాలో తాప్సీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. థ్రిల్లర్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్న ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ కలిసి నిర్మిస్తున్నారు.