Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తాప్సీ ఖాతాలో మరో హిట్

Taapsee Pannu Best Reaction On 'Judwaa 2' Success

టాలీవుడ్‌లో సాధించలేనిది బాలీవుడ్‌లో సాధిస్తోంది తాప్సీ. అక్కడ వరుస హిట్లతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. పింక్, నామ్ షబానా చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న తాప్సీ ఆతర్వాత వరుణ్‌ధావన్‌తో కలిసి నటించిన ‘జుడ్వా 2’ చిత్రంతో కమర్షియల్‌గా కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ నాయికగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ‘ముల్క్’ చిత్రంలో లాయర్ పాత్రలో చక్కగా నటించి మరోసారి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా ‘మన్మార్జియాన్’తో మరోసారి హిట్ కొట్టి శభాష్ అనిపించుకుంది. ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో తాప్సీ తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది.  అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, తాప్సీల మధ్య సాగే ప్రేమకథలోని ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విక్కీ కౌశల్ కాస్త రఫ్‌గా ఉండే బ్యాడ్‌బాయ్‌గా నటిస్తే అభిషేక్ బచ్చన్ రాముడు మంచి బాలుడు తరహా పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా తాప్సీ విభిన్నమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ప్రేమ కథను చక్కగా చూపించి దర్శకుడు అనురాగ్ కశ్యప్ మంచి విజయాన్ని అందుకున్నాడు.

Comments

comments