Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తాప్సీ విశ్వ ప్రయత్నాలు

tapsiసౌత్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన అందాల తార తాప్సీ. ఈ భామ తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోల సరసన పలు సినిమాలు చేసిన బ్లాక్‌బస్టర్ హిట్స్ మాత్రం కొట్టలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం సౌత్‌లో పెద్దగా అవకాశాలు లేవు. దీంతో అవకాశాల వేటలో ఉన్న తాప్సీ హాట్‌హాట్‌గా ఫొటోలకు పొజులిస్తూ ఫిల్మ్‌మేకర్స్‌ను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఈ బ్యూటీ హాట్‌గా ఫొటోలిచ్చింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని ఈ భామ తమిళంలో శింబు సరసన సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘కాన్’ సినిమాలో నటిస్తోంది. ఇక హిందీలో ఆమె రన్నింగ్ షాదీ డాట్‌కామ్ అనే చిత్రంలో చేస్తోంది. సాహసం తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఛాన్స్‌లు లేవు. గంగ, బేబి వంటి పరభాషా చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. ఇక కాన్, రన్నింగ్ షాదీ డాట్‌కామ్ సినిమాలు హిట్టయితేనే ఈ అమ్మడికి కెరీర్ ఉంటుంది. లేకపోతే తెరుమరుగయ్యే పరిస్థితి రాకతప్పదు. దీంతో ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది తాప్సీ.

Comments

comments