Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్ లో తైక్వోండో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పోటీలు..

Taekwondo2

హైదరాబాద్: ‘ ది సన్ పవర్ తైకొండో అకాడమీ’ ఆధ్వర్యంలో ఆదివారం నాడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ లను నిర్వహించనున్నట్లు అకాడమి డైరెక్టర్ బి. చందర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తైకొండో పోటీల్లో పాల్గొనాలనుకునే మార్షల్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్స్, మార్టర్స్ తమ అభ్యర్థుల పేర్లను ఆదివారం ఉదయం 7:30గంటలలోపు నమోదు చేసుకోవాలని కోరారు. లార్జెస్ట్ టైకొండో డిస్ప్లే (30 నిమిషాలు) (పూమసయే -కాటా),మోస్ట్ ఫుల్ కాంటాక్ట్ కిక్ (ఒక గంట), ది పవర్ ఫుల్ ఎల్బో స్ట్రైక్స్ (ఒక గంట) అనే విభాగాల్లో తైకొండో ఈవెంట్స్ జరుగుతాయన్నారు.
ఈ పోటీలు మీర్ పేటలోని తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామని చందర్ తెలిపారు. వివరాలకు 9391322401, 9701236779 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

chander

 

 

 

 

The Sun Power Taekwondo Academy conducts ” Taekwondo Guinness book record breaking events “

Comments

comments