Home సంగారెడ్డి పరిమళించిన మానవత్వం

పరిమళించిన మానవత్వం

Tahsildar

కన్నతల్లిని రోడ్డుపై వదిలివెళ్లిన కొడుకులు
తహసీల్దార్ చొరవతో అనాధాశ్రమానికి తరలింపు

సంగారెడ్డి: నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసిన తల్లిని కన్న కొడుకులు నడిరోడ్డుపై వదిలేస్తే మానవత్వంతో ఆమెకు సహకరించిన తహసీల్దార్ ఉదంతం ఇది. జహీరాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న శకుంతల అనే వృద్ధురాలికి ఇద్దరు కొడుకులున్నారు. వారిద్దరూ బుధవారం తమతల్లి శకుంతలను నిర్ధ్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆకలి, ఆవేదనతో పిచ్చిదానిలా రోడ్ల వెంట తిరిగిన ఆ తల్లి నడిరోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సంగారెడ్డి తహసీల్దార్ విజయ్‌కుమార్ ఆమెను పలకరించి, సేదతీర్చి వివరాలు కనుక్కున్న అనంతరం సంగారెడ్డిలోని 108 వాహనంలో అనాధాశ్రమానికి తరలించారు.

Tahsildar helps to Old Woman whose son’s through away Home.