Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

షాట్‌పుట్‌లో పసిడి

Tajinderpal Singh Toor Clinches Gold: Asian Games 2018

దీపిక, జోష్నలకు పతకాలు, సింధు, సైనా ఆశలు సజీవం, ఎదురులేని మహిళా హాకీ జట్టు

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ ఏడో స్వర్ణం సాధించింది. శనివారం జరగిన పురుషుల షాట్‌పుట్ విభాగంలో తూర్ తజిందర్‌పాల్ సింగ్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. అసాధారణ ప్రతిభను కనబరిచిన తజిందర్‌పాల్ సింగ్ గుండును 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డుతో పసిడి పతకం సాధించాడు. ఐదో ప్రయత్నంలో తజిందర్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కాగా, శనివారం భారత్‌కు స్కాష్‌లో మూడు కాంస్య పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో సింధు, సైనాలు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల హాకీలో భారత్ 41తో దక్షిణ కొరియాను ఓడించింది. కాగా, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడి రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

తజిందర్ కొత్త రికార్డు..
పురుషుల షాట్‌పుట్ విభాగంలో భారత స్టార్ అథ్లెట్ తూర్ తజిందర్‌పాల్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. భారీ ఆశలతో బరిలోకి దిగిన తజిందర్ ఊహించినట్టే దేశానికి పసిడి పతకం అందించాడు. అసాధారణ ఆటను కనబరిచిన తజిందర్ ఐదో ప్రయత్నంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20.75 మీటర్ల వరకు గుండును విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పాడు. కొత్త రికార్డుతో పాటు పసిడి పతకాన్ని గెలిచి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. ఈ క్రీడల్లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం. కాగా, తొలి ప్రయత్నంలో 19.96 మీటర్లు, రెండో ప్రయత్నంలో 19.45 మీటర్లు గుండును విసిరిన తజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. నాలుగోసారి 19.96 మీటర్లు విసిరిన తజిందర్ ఐదో ప్రయత్నంలో ఏకంగా 20.75 మీటర్లు గుండును విసిరి సంచలనం సృష్టించాడు. ఇదే క్రమంలో కొత్త రికార్డును నెలకొల్పి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

క్వార్టర్స్‌లో సైనా, సింధు
బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, పి.వి.సింధులు క్వార్టర్ ఫైనల్‌కు చేరి పతకం ఆశలను సజీవంగా ఉంచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 216, 2114తో ఇండోనేషియాకు చెందిన పిత్రియానిను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన సింధు ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో పోటీలో అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు 2112, 2115 తేడాతో ఇండోనేషియాకే చెందిన జార్జియా మారిస్కాను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే తన మార్క్ షాట్లతో అలరించిన సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ అలవోకగా క్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే పురుషుల డబుల్స్‌లో సాయిరాజ్‌చిరాగ్‌శెట్టి జోడీ రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. కొరియా జంట చోయి సాల్గి మిన్ హ్యుక్ చేతిలో భారత జోడికి ఓటమి ఎదురైంది.

బాక్సింగ్‌లో పవిత్ర సంచలనం..
ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్ పవిత్ర 60 కిలోల విభాగంలో సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌కు చెందిన అగ్రశ్రేణి బాక్సర్ రుక్సానా పర్వీన్‌తో జరిగిన పోరులో పవిత్ర 108 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న పవిత్ర సంచలన విజయంతో ముందంజ వేసింది.

హాకీలో మరో గెలుపు..
మహిళల హాకీలో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 గోల్స్ తేడాతో అగ్రశ్రేణి జట్టు దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ప్రారంభంలో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. అయితే ద్వితీయార్ధంలో భారత్ మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది. ప్రథమార్ధంలో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. 15వ నిమిషంలో నవజోత్ అద్భుత గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది. అయితే మరో ఐదు నిమిషాల తర్వాత కొరియా క్రీడాకారిణి లి యురిన్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. కాగా, 53, 54 నిమిషాల్లో గుర్జిత్ భారత్‌కు రెండు గోల్స్ అందించింది. ఆ వెంటనే 55వ నిమిషంలో స్టార్ క్రీడాకారిణి వందన భారత్‌కు నాలుగో గోల్ సాధించి పెట్టింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ఘన విజయంతో సెమీస్‌కు మరింత చేరువైంది.

స్క్వాష్‌లో  మూడు పతకాలు… మరోవైపు స్క్వాష్‌ విభాగంలో శనివారం భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. భారత క్రీడాకారులు దీపిక పల్లికల్, జోష్న చినప్ప, సౌరవ్ ఘోషల్‌లు సెమీఫైనల్లోనే ఓటమి పాలు కావడంతో భారత్‌కు కాంస్య పతకా లు మాత్రమే దక్కాయి. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక 03 తేడాతో డిఫెండింగ్ చాంపియన్, మలేసియా స్టార్ నికోల్ డేవిడ్ చేతిలో చిత్తయ్యింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నికోల్ 117, 119, 116 తేడా తో దిపికను ఓడించింది. దీపిక ప్రపంచ నంబర్‌వన్ నికోల్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కనబరిచిన నికోల్ అలవోక విజయంతో ఫైనల్‌కు చేరింది. కిందటిసారి కూడా నికోల్ చేతిలోనే దీపిక ఓటమి పాలైన విష యం తెలిసిందే. మరో సెమీఫైనల్లో జోష్న చినప్ప 13 తేడాతో మలేసియాకే చెందిన సుబ్రమణియం శివసంగరి చేతిలో ఓటమి పా లైంది. జోష్న ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సుబ్రమణియం మూడు సెట్ల ను గెలవగా, జోష్న ఒకదాం ట్లో మాత్రమే విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సౌరవ్ ఘోషల్ కూడా ఓటమి పాలయ్యాడు. హాంకాంగ్ ఆటగాడు ఎవి చున్‌మింగ్‌తో జరిగిన పోరులో సౌరవ్ పోరాడి ఓడాడు. హోరాహోరీగా సాగిన పోరాటంలో చున్‌మింగ్ 32 తేడాతో ఘోషల్‌ను ఓడించాడు. కాగా, స్వర్ణం సాధిస్తారని భావించిన భారత ఆటగాళ్లు కేవలం కాంస్య పతకాలకే పరిమితమై నిరాశ పరిచారు.

Comments

comments