Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకొండి

mantri-harish-rao

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : మెదక్‌లో సిఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఉన్న మంత్రి హరీశ్‌రావు అకాల వర్షాల నేపథ్యంలో మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితిని బుధవారం వాట్సప్ ద్వారా సమీక్షించా రు. చిన్నకోడురు మండలంలోని గోనెపల్లి గ్రామంలో వర్షానికి తడిసిన ధాన్యం అని పోస్ట్ చేయడంతో ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్లలలో కావాల్సిన సౌకర్యాలపై ఆరా తీయాలని, సరిపడా టార్ఫలిన్ కవర్లు అందజేయా లని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యంను ఎప్పటికప్పుడు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

comments