Home టెక్ ట్రెండ్స్ పైసా చెల్లించకుండా ఆపిల్ ఫోన్ మీ సొంతం

పైసా చెల్లించకుండా ఆపిల్ ఫోన్ మీ సొంతం

IPOHE
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ తన కస్టమర్లకు శుభవార్త వినిపించింది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్‌, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 8 స్మార్ట్‌ మెబైల్ ఫోన్లపై జీరో డౌన్‌పేమెంట్ ఇఎంఐ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్ లో ఉన్న ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో జూన్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇఎంఐ ఆఫర్ 18 నెలలపాటు ఉందని కంపెనీ తెలియజేసింది. ఎంపిక చేసిన కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు ఆపిల్ సంస్థ పేర్కొంది.