Home రాష్ట్ర వార్తలు 100 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

100 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

GRASS

మన తెలంగాణ/కురవి : అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టుకున్నట్లు ఎక్ష్సైజ్ ఎస్‌ఐ రాయబారపు రవికుమార్ తెలిపారు. ఎక్ష్షైజ్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబాద్ జిల్లా కురవి మండలంలోని బలుపాల గ్రామ శివారు లింగ్యాతండాకు చెందిన మాలోతు కిషన్, మాలోతు భద్రులు కొంత కాలంగా అక్రమంగా నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. మహబూబాబాద్ ఎక్ష్సైజ్ సిఐ రమేష్‌చంద్ర ఆదేశాల మెరకు శుక్రవారం సోదాలు జరుపగా తండా శివారు గడ్డివాములో సుమారు 100 క్వింటాళ్ల నల్ల బెల్లం గల బ్యాగులో ఉంచినట్లు తెలిపారు. అట్టి బ్యాగులను పట్టుకొని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్ష్సైజ్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది మహేందర్, వెంకన్న, జ్యోతి, కరుణాకర్ ఉన్నారు.