Home లైఫ్ స్టైల్ సన్‌స్క్రీన్ లోషన్‌తో చర్మానికి రక్షణ…!

సన్‌స్క్రీన్ లోషన్‌తో చర్మానికి రక్షణ…!

Skin Care

 

వేసవిలో ఎండ ప్రభావం చర్మంపైన ఎక్కువగా ప్రసరిస్తుంది. అందువల్ల, వేసవిలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, మేకప్ విషయంలో కూడా తగిన అవగాహనను ఏర్పరుచుకోవాలి. వేసవిలో వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల, చెమట ఎక్కువగా పడుతుంది. చెమటవల్ల మేకప్ తొలగిపోతుంది. ఎండలోని వేడి చర్మం మీద ప్రసరించినప్పుడు చర్మం కందిపోయి నల్లగవడం, నల్లమచ్చలు రావడం, చర్మానికి ముడతలు ఏర్పడటం లాంటి సమస్యలు కలుగుతాయి.

సన్‌స్క్రీన్‌లోషన్ చర్మానికి రాయడం వల్ల, ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ముఖం మీదే కాకుండా, ఎండతగిలే భాగాలకూ రాయాలి. చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి. సాధారణ చర్మానికీ, పొడిచర్మానికీ 30 కంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ వాడటం మంచిది. జిడ్డు చర్మం ఉండేవారు నాన్ ఆయిలీ 30 లేదా 30 ప్లస్ ఎస్‌పిఎఫ్ సన్‌స్క్రీన్ చర్మానికి రక్షణనిస్తుంది. సున్నిత చర్మానికి న్యూట్రల్ సోప్ సన్‌స్క్రీన్‌ను వాడటం చర్మానికి ఆరోగ్యకరం. వేసవిలో సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హానికలిగించకుండా, సన్‌స్క్రీన్ లోషన్ అడ్డుకుంటుంది.

వేసవిలో వైట్ టిస్యూపేపర్ వాడితే, చర్మం తాజాగా కనిపిస్తుంది. మేకప్ చేసుకోబోయే ముందు ఐదునిమిషాల పాటు ఐస్‌తో ముఖాన్ని రుద్దితే, చాలా సేపటివరకూ ముఖం తేమగా, తాజాగా ఉంటుంది. మేకప్ కూడా ఎక్కువ సమయం ముఖంపై నిలిచి ఉంటుంది. మాయిశ్చరైజర్‌ను కూడా వాడాలి.

ఎండలో బయటనుంచి రాగానే, చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వేసవిలో మేకప్ సామగ్రి క్రీమ్ బేస్డ్ సాధనాలను వాడేకంటే, వాటర్ బేస్ వంటివి ఉపయోగించాలి. వేసవిలో అతిగా మేకప్‌ను చేసుకోకూడదు. రాత్రి పడుకునే ముందు మేకప్‌ను తొలగించుకుని, ముఖం కడుక్కుంటే చర్మగ్రంధులు చక్కగా తెరుచుకుంటాయి.

ఈ కాలంలో తలకు కూడా స్వేదం పడుతుంది. వెంట్రుకలకు, వాతావరణంలోని దుమ్ముధూళి, అంటుకుని, దానికి స్వేదం తోడై వెంట్రుకలు జిడ్డుగా, అపరిశుభ్రంగా మారిపోతాయి. జుట్టు దుర్వాసనగా ఉండటమేకాక, తలలోంచి స్వేదం మెడమీదకు పాకి మెడ జిడ్డుగానూ మారిపోతుంది. అందువల్ల, జుట్టుకు రెండు మూడు సార్లు మాత్రమే స్వల్పంగా నూనెను రాయాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో రోజ్‌వాటర్‌ను కానీ, పన్నీరు కానీ కలపాలి. బాడీ డియోడరెంట్, పెర్‌ఫ్యూమ్‌ను చర్మానికి స్ప్రే చెయ్యాలి. మోకాళ్లు, మోచేతులు, భుజాల కింద చెమట కారణంగా బాక్టీరియా ఏర్పడుతుంది. ఈ భాగాలను శుభ్రంగా కడుక్కుని టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించాలి.

 

Take care of Skin Care during Summer
Take care of Skin Care during Summer