Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పాలిటెక్నిక్ కళాశాలను దత్తత తీసుకోండి: కడియం

polytechnic-collegeరంగారెడ్డి: వికారాబాద్ పట్టణానికి దూరంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను డిఎస్‌పి దత్తత తీసుకోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వికారాబాద్ డిఎస్‌పి స్వామిని ఆదేశించారు. గురువారం పాలిటెక్నిక్ భవనం ప్రారంభానికి విచ్చేసిన ఆయన డిఎస్‌పిని వేదిక మీదకు పిలిచి ఈ ఆదేశాలు ఇచ్చారు. వారానికి ఒక్కసారి ఈ కళాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ కళాశాలలో బాలికలు ఉన్నారని వారి రక్షణ బాధ్యతలను స్వీకరించాలని సూచించారు. మీరు చెప్పిన విషయాలను తప్పకుండా అమలు చేస్తామని డిఎస్‌పి అన్నారు. కళాశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

Comments

comments