Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌కు తలైవాస్ షాక్

KAbaddiన్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో తమిళ్ తలైవాస్ సంచలన విజయం సాధించింది. మంగళవారం ఇక్కడి త్యాగరాజ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఉత్కంతభరిత పోరులో తలైవాస్ 3534 తేడాతో పటిష్టమైన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను కంగుతినిపించింది. ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్న గుజరాత్‌కు ఇది ఊహించని షాక్ లాంటిదే. రెండు జట్లు కూడా ప్రారంభం నుంచే నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లు కూడా దూకుడుకు ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్‌లో ఉత్కంఠత తప్పలేదు. తమిళ్ జట్టులో అజయ్ ఠాకూర్ అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. ప్రారంభం నుంచే అసాధారణ రీతిలో చెలరేగి పోయిన అజయ్ ఏకంగా 14 పాయింట్లు సాధించి జట్టుకు అండగా నిలిచాడు. మరో స్టార్ ఆటగాడు ప్రపంజన్ కూడా అద్భుత ప్రతిభను కనబరిచాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను హడలెత్తించిన ప్రపంజన్ 9 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని దూకుడుతో తమిళ్ పైచేయి సాధించింది. మరోవైపు గుజరాత్ జట్టు కూడా విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. సచిన్ అద్భుత ఆటతో అలరించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను హడలెత్తించిన సచిన్ రికార్డు స్థాయిలో 11 పాయింట్లను సాధించాడు. కాగా, చంద్రన్, ఫాజెల్ ఐదేసి పాయింట్లు సాధించారు. అయితే మిగతావారు విఫలం కావడంతో గుజరాత్‌కు పరాజయం తప్పలేదు.

Comments

comments