Home తాజా వార్తలు కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి కనిపించడం లేదా : తలసాని

కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి కనిపించడం లేదా : తలసాని

Tasani-srinivas

హైదరాబాద్: తెలంగాణలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా… అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధిని దేశమంతా పొగుడుతుంటే, కాంగ్రెస్ నేతలకు కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యలయంలో జరిగిన సమావేశంలో తలసాని ప్రసంగించారు. టిఆర్ఎస్ సర్కార్ పాలమూరు వలసలు నివారించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణమని మంత్రి అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రులే  కెసిఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రశంసించారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ బేగంపేటలో క్యాంప్ ఆఫీస్ కడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మేదపలేదని ఆయన ప్రశ్నించారు. వారసత్వ రాజకీయల గురించి కాంగ్రెస్ వాళ్లా మాట్లాడడం వింతగా ఉందని తలసాని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో పదవులు పట్టుకొని వేలాడింది కాంగ్రెస్ వాళ్లు కాదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.