Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎన్ టి ఆర్, ప్రభాస్ లకు తలసాని గ్రీన్ ఛాలెంజ్!

Talasani srinivas yadav green challenge to prabhas and jr ntr

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్ టిఆర్, ప్రభాస్ లకు శుక్రవారం గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను తలసాని స్వీకరించి తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం ఎన్ టిఆర్, ప్రభాస్, దర్శకుడు త్రివిక్రమ్, టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. హరితహారం కార్యక్రమం కింద తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటామని చెప్పారు. మన మనుగడ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని తలసాని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతలు తీసుకోవాలని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.

 

Comments

comments