Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

బోనాల ఉత్సవాలపై తలసాని సమీక్ష

Tasani-srinivas-yadav-image

హైదరాబాద్: నగరంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లను చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్‌పేటలోని మహంకాళి అమ్మవారి గుడిలో జరిగిన ఈ సమావేశంలో ఎంపి బండారు దత్తాత్రేయ, ఎంఎల్ఎ కిషన్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బోనాల ఉత్సవాల కోసం రూ. 50 లక్షలతో ప్రభుతం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. అంబర్‌పేట నియోజకవర్గంలో జిహెచ్‌ఎంసి నిధులను కేటాయించి బోనాల  ఏర్పాట్లు అధికారులను ఆదేశించారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్లను మంజూరు చేసిందని తలసాని అన్నారు. బోనాలను పురస్కరించుకొని రూ. 5.6 లక్షలతో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేస్తున్నమని చెప్పారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.  పారిశుధ్య నిర్వహణ కోసం అదనంగా 200 మంది సిబ్బందిని తీసుకుంటామని మంత్రి స్పష్టం చేేశారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల కోసం మహంకాళి ఆలయం వద్ద  ఒక వేదికను ఏర్పాటు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

Comments

comments