Search
Wednesday 21 November 2018
  • :
  • :

మహాలక్ష్మీగా వస్తున్నా…!

మిల్కీబ్యూటీ తమన్నాను ఎవరైనా సరే తెలుగమ్మాయే అనుకుంటారు. నాజూకైన శరీరంతో ,మంచి నటనతో ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఆమెకు ఆమే సాటి. నటనలో లీనమై నటించడం అలవాటు చేసుకున్న కొద్దిమందిలో తను ఒకటి  మాతృభాష సింధీ అయినా కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పుకునే తమన్నాను మెచ్చుకోవాల్సిందే. ఏ పాత్రలోనైనా లీనమైపోయేలా నటించడం ఆమె ప్రత్యేకత.

That-is-MahaLaxmi

పేరు : తమన్నా భాటియా
నిక్ నేమ్ : మిల్కీ బ్యూటీ
ఇష్టమైన సినిమా : దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఆనంద్, దిల్ తో పాగల్ హై, టైటానిక్.
పుట్టింది :1989 డిసెంబర్ 21
నచ్చిన రంగు : ఎరుపు, నీలిరంగు.
ఇష్టమైనవి : నటన, డాన్స్.
తల్లిదండ్రులు : సంతోష్ భాటియా, రజినీ భాటియా.
అన్నయ్య : ఆనంద్ భాటియా, మెడిసిన్ చదివాడు.
ఫిలింఫేర్ అవార్డులు : తెలుగులో( కొంచెం ఇష్టం కొంచెం కష్టం ), తమిళ్ లో( కళ్ళూరి ) సినిమాలకు ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.

ఇష్టమైన ఫుడ్ : పంజాబీ వంటలు. బిర్యానీ అంటే చాలా ఇష్టం తానే వండుతకుని తినడం అంటే ఎంతో సరదా అంటోంది.
పదో ఏటే ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు థియేటర్ ఆర్ట్‌లో చేర్పించారు . 2005 లో చాంద్ సారోషన్ చెహ్ర అనే హిందీ సినిమాతో కెరియర్ మొదలైంది. 2006 లో కేడీతో తమిళంలో అడుగు పెట్టింది. 2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ , తమిళ్ లో కళ్ళూరి సినిమాలు తమన్నాను వెండి తెరపై నటిగా ముద్రవేసిన చిత్రాలు . తరువాత కండైన్ కాదలై, పయ్యా, సిరుత్తె , వీరం సినిమాలు తమిళంలో బాగా గుర్తింపు నిచ్చాయి. తెలుగులో కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి సినిమాల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది.

హిమ్మత్ వాలా తో హిందీలో అడుపెట్టింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం ’క్వీన్’. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. విమర్శకుల ప్రశంసలూ అందాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ’దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో పునః నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకుడు. మను కుమరన్ నిర్మాత. ”ఓ అమాయకురాలి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో సాగే కథ ఇది. పరిస్థితులే ఈ అమాయకురాల్ని ధైర్యశాలిగా తీర్చిదిద్దుతాయి. ఈఫిల్ టవర్‌కీ ఈ కథకీ ఓ లింకు ఉంది. అదేంటన్నది తెరపై చూడాలంటోంది తమన్నా..

Comments

comments