Home తాజా వార్తలు టాలీవుడ్ క్వీన్‌గా తమన్నా

టాలీవుడ్ క్వీన్‌గా తమన్నా

QUEEN

హైదరాబాద్ : హిందీలో కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమాకు రీమేక్ తెలుగులో రాబోతోంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆదివారం తమన్నా ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తమన్నా అందంగా కనిపిస్తున్నారు. ఆమె వేసుకున్న నెక్లెస్‌కు కూడా క్వీన్ అని రాసి ఉన్న పెండెంట్ ఉంది. ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్వీన్ చిత్రం తమిళం, మలయాళంలోనూ రాబోతుంది. తమిళ వెర్షన్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రానికి ప్యారిస్ ప్యారిస్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. మలయాళంలో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Tamanna as Tollywood Queen