Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఊహించనివి జరుగుతాయి

Tamanna Completed 12 Years In Film Industry

మిల్కీబ్యూటీ తమన్నా ఈ మధ్య తన జోరు తగ్గించిందని చెప్పక తప్పదు. తెలుగులో తమన్నా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ‘క్వీన్’ రీమేక్. ఇక తమిళంలో ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవు. అక్కడ తమన్నా ఉదయనిధి స్టాలిన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇక ఈ మిల్కీబ్యూటీ తాజాగా  చిత్ర పరిశ్రమలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ “సినిమాల్లోకి వచ్చి 12 ఏళ్లు అయింది. తెలుగు, తమిళ్‌లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించాను. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చేసిన కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’ చిత్రం హిందీలో ఘన విజయం సాధించి బాలీవుడ్‌లో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్ర పరిశ్రమలో ఊహించనివి జరుగుతాయి. ఊహించినవి జరగాలని లేదు. ఇండస్ట్రీలో పేరు, డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిందే”అని పేర్కొంది.

Comments

comments