Home వార్తలు వృద్ధురాలి పాత్రలో తమన్నా!

వృద్ధురాలి పాత్రలో తమన్నా!

tamannahఒకప్పుడు హీరోయిన్‌లు డీ గ్లామరస్ పాత్రలో నటించాలంటే ఆసలు ఆసక్తి చూపించే వా రు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నేడు ఇండస్ట్రీలో టాప్ హీరోయి న్‌లుగా చెలామణి అవుతున్న అందాల భామలు ప్రయోగాలు చేసేందుకు సై అంటున్నారు. డీ గ్లామరస్ పాత్రలలో నటించి మెప్పిస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా డీ గ్లామరస్ లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అభినేత్రి’ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఏఏఏ’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటి స్తోంది.సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు మూడు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నాడు. 90 కిలోల బరువుగల 60 ఏళ్ల వృద్ధుడి పాత్రను శింబు పోషిస్తుండగా ఆయ న సరసన తమన్నా 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనుం దట. ఆ పాత్ర కోసం తమన్నా ఇప్పటికే కసరత్తులు చేస్తోందని తెలి సింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా శ్రియా నటిస్తోంది. ఈ సినిమాలో శింబు… అశ్విన్ తాత, మదన మైఖేల్ క్యారెక్ట్‌లలో కని పించనున్నాడు. ఇక మూడో పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది.