Home సినిమా అదే ఫార్ములాను అనుసరిస్తుందట

అదే ఫార్ములాను అనుసరిస్తుందట

Tamanna bhatia In F2 Movie
అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న భామ తమన్నా. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమధ్య తమన్నా కొన్ని ఫెయిల్యూర్స్‌ను చవిచూసింది. కల్యాణ్‌రామ్‌తో చేసిన ‘నా నువ్వే’. సందీప్ కిషన్, నవదీప్ వంటి యంగ్‌స్టార్స్‌తో రెచ్చిపోయి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన ‘నెక్స్ ఏంటి’ సినిమాలు ఆమెను బాగా నిరాశపరిచాయి. అయితే తాజాగా వచ్చిన మల్టీస్టారర్ ‘ఎఫ్2’ తమన్నాకు ఊరటనిచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించింది ఈ మిల్కీ బ్యూటీ. దీంతో ఇదే ఫార్ములాను ఆమె అనుసరించాలనుకుంటోందట. స్టార్ హీరోల సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటోందని తెలిసింది. యంగ్ హీరోల సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌కు మాత్రమే ఓకే చెప్పాలని నిర్ణయించుకుందట. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలని తమన్నా భావిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా’లో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది తమన్నా. అయితే ఈ భామ లీడ్ రోల్ పోషించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఎఫ్2’ సక్సెస్‌తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన తమన్నా వరుసగా మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటోంది.

tamanna that is mahalakshmi movie release soon