Search
Tuesday 20 November 2018
  • :
  • :

హాట్‌హాట్‌గా తమన్నా

Tamanna to do a sizzling item song in KGF

తమన్నాకు ఈమధ్య సినిమాలు తగ్గిపోయినప్పటికీ ఆమెలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మిల్కీబ్యూటీ అందానికి యువకులు ఇప్పటికీ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఆమె గ్లామర్, అందచందాలను హైలైట్‌గా చూపిస్తూ ఫిల్మ్‌మేకర్స్ తమన్నా చేత స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం కన్నడలో ‘కెజిఎఫ్’ అనే సినిమాలో ఐటమ్‌సాంగ్ చేస్తోంది. యంగ్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రంలో ‘జోకే…’ అంటూ సాగే పాటలో తమన్నా హాట్‌హాట్‌గా స్టెప్పులేసింది. ఈ సాంగ్ మేకింగ్ సందర్భంగా తీసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది తమన్నా. ఇందులో ఆమె హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. ఈ పాట ఆమె అభిమానులకు కనువిందు చేయడం ఖాయమనిపిస్తోంది. అయితే ఈ సాంగ్ షూటింగ్‌ను తాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది తమన్నా. కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో విడుదలవుతున్న ఈ చిత్రంలోని తన స్పెషల్ సాంగ్‌ను చూసి అభిమానులు ఎంజాయ్ చేయాలని ఆమె కోరింది. గతంలో తమన్నా కన్నడలో ‘జాగ్వార్’ అనే సినిమా కోసం కూడా స్పెషల్ సాంగ్ చేసింది.

Comments

comments