Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆ సినిమాపై ఎన్నో ఆశలు

Tamanna Act In Queen Remake That is Mahalaxmi movie

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నాకు ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ‘బాహుబలి’ వంటి క్రేజీ ప్రాజెక్టులో మెరిసిన ఈ భామకు ఆతర్వాత సీన్ రివర్స్ అయింది. ఆమె బాహుబలి క్రేజ్ తో పారితోషికం పెంచేసింది. దీంతో నిర్మాతలు ఈ బ్యూ టీని తీసుకోవడం తగ్గించేశారు. ఇటీవల తమన్నా నటించిన ‘నా నువ్వే’ సినిమా కూడా నిరాశపరచడంతో  ఇప్పుడు ఆమె ను తీసుకునేవారే కరువయ్యారు. చాలా గ్యాప్ వచ్చేసరికి ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ మిల్కీబ్యూటీ చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. అదే ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’. ఈ సినిమాపై ఆ మె ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వంలో గత ఏడాది మొదలుపెట్టిన ఓ చిత్రం షూటింగ్ పూర్తయింది. సందీప్‌కిషన్‌తో జోడీకట్టిన ఈ మూవీ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా చేయకుండా మధ్యలో వదిలేసినట్టు సమాచారం. ఇలా చేసిన సినిమాలు విడుదల కాకుండా కొత్త సినిమాలు  చేతిలో లేక తమన్నాకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

Comments

comments