Search
Monday 19 November 2018
  • :
  • :

రోడ్డుప్రమాదంలో స్టార్ హీరో ఫ్యాన్స్ మృతి!

Vijay fans died in Road Accident

చెన్నై: ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో సినిమా చూసి వస్తున్న ఇద్దరు అభిమానులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు కబళించింది. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పుంజైపులియాంపట్టిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు విజయ్‌ ఫ్యాన్స్ ఇద్దరు మృతి చెందారు. మృతులను సత్యమంగళంకు చెందిన దినేష్‌కుమార్‌(18), శక్తి(18)లుగా గుర్తించారు. ఇద్దరు కూడా  కోవైశరవణన్‌పట్టిలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తమిళ దళపతి విజయ్‌ వీరాభిమానులైన వీరు విజయ్‌ నటించిన కొత్త చిత్రం ‘సర్కార్‌’ సెకండ్ షో చూశారు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. అయితే, పుంజైపులియాంపట్టి మార్గంలో వస్తుండగా అదుపు తప్పిన బైక్‌ వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Actor Vijay fans died in Road Accident

Telangana Breaking News

Comments

comments